బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని BCCI కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ విజయం సందర్భంగా జరిగే సెలబ్రేషన్లకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొంది. ఇందుకోసం దేవజిత్ సైకియా, ప్రభేజ్ సింగ్, రాజీవ్ శుక్లా సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో మార్గదర్శకాలను సిద్ధం చేయనున్నట్లు BCCI ప్రకటించింది. అలాగే, 2025-26 దేశవాళీ క్రికెట్ సీజన్ ఆగస్టు 25న దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానుందని వెల్లడించింది.