బీసీసీఐ ఐపీఎల్ ఆటగాళ్లను హెచ్చరించింది. ఐపీఎల్‌లోని అన్ని జట్లకు, మేనేజర్లకు, కోచ్లకు, ఆటగాళ్లకు, యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇటీవల మరింత యాక్టివ్ అయ్యారని, అతడికి క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన అనుభవం కూడా ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. కాగా ఐపీఎల్ జట్లకు బీసీసీఐ వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది.