ఎన్నికల సమయంలో బీసీలు గుర్తుకొచ్చారు: బీజేపీ

64చూసినవారు
ఎన్నికల సమయంలో బీసీలు గుర్తుకొచ్చారు: బీజేపీ
TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కుల గణన సర్వేపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకు వస్తున్నారని ఆరోపించారు. కేవలం ఓట్లు పొందేందుకే ఇప్పుడు బీసీ నినాదం అందుకున్నారని, ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, రాష్ట్ర జనాభా సంఖ్యకు పొంతన లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.33 కోట్లు ఉండగా, కుల గణన ప్రకారం 3.76 కోట్లుగా ఉందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్