TG: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 70 ఏళ్లలో బీసీలకు గుంట భూమి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని ఆరోపించారు. మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నే మీ అన్యాయాలను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో బీసీలకు కోకాపేట, ఉప్పల్ భగాయత్ లాంటి ప్రాంతాల్లో వేల కోట్ల విలువ చేసే భూములు కేసీఆర్ ఇచ్చారంటూ పేర్కొన్నారు.