పలు రకాలుగా జరుగుతున్న మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. 'తక్కువ ధరకే వస్తువులు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి. అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడకండి' అని.. 'డిజిటల్ అరెస్ట్ అంటే పక్కా మోసం. అస్సలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదు. మీకు యూనిఫాంలో వీడియో కాల్ చేసి బెదిరిస్తే అస్సలు భయపడొద్దు' అని.. 'వాట్సాప్‌లో వచ్చే ట్రేడింగ్ టిప్స్ నమ్మొద్దు' అంటూ పోలీసులు 'X' వేదికగా హెచ్చరించారు.