జాగ్రత్త.. సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నారా?

75చూసినవారు
జాగ్రత్త.. సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నారా?
సాధారణంగా ఎండ నుంచి వచ్చే UV కిరణాల నుంచి చర్మ రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్ వాడుతుంటారు. అయితే, కొన్ని క్రీమ్స్ లో వాడే రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నట్లు వెల్లడయింది. బెంజీన్ రసాయనం ఉండే సన్ స్కీన్ వాడితే లుకేమియా, లింఫోమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ నివేదికలో వెల్లడించారు. వీటిని కొనేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. SPF 30+ ఉంటేనే UV కిరణాల నుంచి రక్షణ ఉంటుంది.