‘బ్లూటూత్’ స్పీకర్లతో జాగ్రత్త.. భారత సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక

19చూసినవారు
‘బ్లూటూత్’ స్పీకర్లతో జాగ్రత్త.. భారత సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక
మీరు బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు, ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త. బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు ముప్పు కలిగిస్తాయని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కాల్ రికార్డింగ్, హానికరమైన ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని, అలాగే డివైజ్‌ను కూడా హ్యాక్ చేస్తాయని వెల్లడించింది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్