TG: చిన్నారులు, మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.