తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు 116 దేశాల అందగత్తెలు హాజరయ్యారు. రాష్ట్రానికి వచ్చిన వారు హైదరాబాద్‌లోని చార్మినార్, రామప్ప, వెయ్యి స్థంబాల ఆలయాలను సందర్శించారు. తమ అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాల గొప్పతనాన్ని ఫాలోవర్లకు పరిచయం చేస్తున్నారు. ఇది తెలంగాణ పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది.