జూబ్లీహిల్స్‌ పోలీసుల అదుపులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

36045చూసినవారు
జూబ్లీహిల్స్‌ పోలీసుల అదుపులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో తాజాగా ఆయనపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేశారు. జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో అపసవ్య దిశలో కారు నడిపి.. అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో దురుసుగా ప్రవర్తించారు.

సంబంధిత పోస్ట్