బెంగళూరు తొక్కిసలాట కేసులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించిన ఉత్తర్వులను జూన్ 11 వరకు రిజర్వ్ చేసింది. కాగా ఆర్సీబీ విజయోత్సవాల వేడుకలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు.