బెంగళూరులో జరిగిన తొక్కిసలా ఘటనపై వేసిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. లోపాలు, బాధ్యతారాహిత్యంపై హైకోర్టు 9 ప్రశ్నలు వేసింది. వీటిలో ముఖ్యంగా జన సమ్మేళనం నిర్వహణ, అనుమతుల మంజూరు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత కోరింది. ప్రభుత్వ యంత్రాంగం తగిన ముందు జాగ్రత్తలు తీసుకుందా? అనేది ప్రధాన ప్రశ్నగా నిలిచింది.