ఇండియాలో బెస్ట్ పోలీసింగ్‌ను అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్.1 స్థానంలో ఉంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2022 ప్రకారం ఇతర రాష్ట్రాలు ఫాలో అయ్యేలా తీసుకుంటున్న నిర్ణయాలు, అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులు, పౌర-స్నేహపూర్వక కార్యక్రమాలు, ఆధునికీకరణ, పారదర్శకతను బేస్ చేసుకొని రాష్ట్రాలను ర్యాంక్‌లను ఇచ్చారు. రెండో స్థానంలో కర్ణాటక, మూడు ఆంధ్రప్రదేశ్, నాలుగు ఒడిశా ఉన్నాయి. 2024 డేటా ఇంకా రిలీజ్ కాలేదు.