నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మొబైల్ రూ.27,000 వద్ద అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7350 ప్రో చిప్సెట్, డ్యూయెల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లేతో మంచి డిజైన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ట్రాన్స్పరెంట్ బ్యాక్, గ్లిఫ్ లైటింగ్ ఇంటర్ఫేస్ కూడా పొందుతుంది. రూ.30 వేల కంటే తక్కువ ధర వద్ద లభించే ఫోన్ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 7ఏ, రెడ్మీ నోట్ 14 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, హానర్ 200 వంటివి ఉన్నాయి.