బెట్టింగ్ కేసులో తమపై వస్తున్న ఆరోపణలను వైజయంతీ మూవీస్ ఖండించింది. బెట్టింగ్ కేసులో బుధవారం నీలేష్ చోప్రా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీలేష్ చోప్రాను వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్ గా పోలీసులు FIRలో పేర్కొన్నారు. అయితే నీలేష్ చోప్రా అనే వ్యక్తి తమ దగ్గర పని చేయలేదని వైజయంతీ మూవీస్ స్పష్టం చేసింది. పోలీసులకు కూడా ఇదే చెప్పామని వెల్లడించింది.