TG: కామారెడ్డిలో బెట్టింగ్ మోజు కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అప్పుల బాధల వల్లే నా భర్త చనిపోయాడని, బెట్టింగ్ యాప్‌లను తక్షణమే భార్య శ్రీలత నిషేధించాలని కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.