వేసవి కాలం సమీపిస్తుండడంతో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అయితే దీనివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు ముందే చెబుతున్నారు. వడగాల్పుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య వస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం,తల నొప్పి, కంటి చూపు మందగించడం వంటి అనేక సమస్యలు వస్తాయట.