డ్రోన్ దాడులకు కౌంటర్‌గా ‘భార్గవాస్త్ర’ (VIDEO)

82చూసినవారు
పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ ‘భార్గవాస్త్ర’ కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన ఈ సిస్టమ్‌ను గోపాల్‌పూర్‌లోని ఆర్మీ సమక్షంలో విజయవంతంగా పరీక్షించారు. మూడు విడతల పరీక్షల్లో భార్గవాస్త్ర టార్గెట్‌ను ఖచ్చితంగా హిట్ చేసినట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా మారనుంది.

సంబంధిత పోస్ట్