ఉత్తమ్ చెప్పిన వివరాలనే భట్టి చెప్పారు: MLC కవిత

79చూసినవారు
ఉత్తమ్ చెప్పిన వివరాలనే భట్టి చెప్పారు: MLC కవిత
తెలంగాణ శాసనమండలి కులగణన నివేదికకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ పై MLC కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ రెండు రోజుల కిందట చెప్పిన కులగణన వివరాలనే ఇప్పుడు భట్టి విక్రమార్క చెప్పి మమ అనిపించారని విమర్శించారు. ఈ కులగణన వివరాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పడం లేదని మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలతో మండలిలో ఒక్కసారిగా దుమారం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్