TG: హైదరాబాద్‌లో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్త్రీ సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతుందని, ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా ఏడాదికి రూ.21,000 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు మహిళలకు అందించడం విశేషమన్నారు. అలాగే మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, గ్రీన్ ఎనర్జీ రంగంలో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.