TG: మహిళలకు వడ్డీ లేని రుణాల విషయంలో భట్టి విక్రమార్క మంచిర్యాలలో మరోసారి అబద్ధాలు చెప్పారని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ₹21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని మళ్ళీ అదే పాత పాట పాడి మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 'బ్యాంకు లింకేజీ కల్పించి, ₹21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు అని ప్రచారం చేస్తున్నారు. ఎప్పటి లాగే ₹5 లక్షల వరకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్న మాట వాస్తవం కాదా?' అని ప్రశ్నించారు.