TG: తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ పథకం అమలుపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు. సమావేశానికి వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో ఈ స్కీం అమలులో బాగంగా యువతకు పలు కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం అందించడంపై చర్చించినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా యువత రూ.2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందవచ్చు.