ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేసే బాధ్యత తనదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఆదివాసీ సాధికారత శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు భట్టి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చులు చేస్తున్నారా? లేదా అనే అంశంపై ఇప్పటికే అధికారుల నుంచి నివేదిక కోరామన్నారు. నివేదికలు వచ్చాక పక్కాగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు.