తెలంగాణ రైతులకు హక్కులను కల్పిస్తూ మేలు చేయాలని తీసుకొచ్చిందే భూ భారతి చట్టమని Dy. CM భట్టి విక్రమార్క అన్నారు. HYDలో జరిగిన 'భూభారతి' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని భూ భారతి 2025 చట్టాన్ని ప్రారంభించడం చారిత్రాత్మకమని చెప్పారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతలబు, ఇబ్బంది లేకుండా తయారు చేసింది 'భూభారతి-2025' చట్టం అని ప్రకటించడానికి చాలా గర్వంగా ఉందన్నారు.