‘భూభారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: సీఎం రేవంత్

77చూసినవారు
‘భూభారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: సీఎం రేవంత్
తెలంగాణలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘భూభారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకొస్తామన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞప్తులను తీసుకుని వాటిని పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్