TG: ఆసాములకు, రైతులకు పూర్తి భద్రత కల్పించేలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్, మహిళలకు ఫ్రీ బస్సు అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు 40 శాతం మెస్ ఛార్జీలు, ఆడపిల్లలకు 200 శాతం కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.