బీబీనగర్‌ ఎయిమ్స్‌ మెడికో అనుమానస్పద మృతి

66చూసినవారు
బీబీనగర్‌ ఎయిమ్స్‌ మెడికో అనుమానస్పద మృతి
TG: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎయిమ్స్‌ మెడికో అనుమానస్పదస్థితిలో మృతిచెందారు. బీబీనగర్‌ పెద్ద చెరువులో మెడికో మృతదేహం లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు MBBS 4వ సంవత్సరం చదువుతున్న అభిజిత్‌జోయ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా, మెడికో మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్