ప్రస్తుతం సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ మోసాలు అమాయకులు బలి అవుతున్నారు. దీంతో BSNL అలర్ట్ అయింది. ఈలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి BSNL కేవైసీ కోసం ఎలాంటి మెసేజులు పంపదని, అలాంటి వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు సూచించింది. ఎవరైనా కాల్ చేసి కేవైసీ సమర్పించాలని, లేకపోతే సిమ్ బ్లాక్ అవుతందని చెబితే నమ్మొద్దని పేర్కొంది.