AP: బెల్టు షాపుదారులకు బిగ్ షాక్ తగిలింది. ఇకనుంచే ఎక్కడ బెల్ట్ షాపు కనిపించినా ఉపేక్షించొద్దని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్, సాంకేతికంగా పౌర సేవలు అందించడంపై అమరావతిలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాదు ఈ గవర్నెన్స్ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.