మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణాల్లో తప్పిదాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఓ నివేదికను విడుదల చేసింది. భద్రాద్రి ప్లాంట్‌తో వచ్చే 25 ఏళ్లలో ప్రజలపై రూ.9వేల కోట్ల భారం పడనున్నట్లు నివేదికలో తేలింది. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రూ.3,642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. ఈ నివేదికపై అసెంబ్లీలో కూడా చర్చించనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.