లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసులో భాగంగా పోలీసులు ఇవాళ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో పోలీసులు రాజ్ తరుణ్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. వీరిద్దరు పదేళ్లుగా సహజీవనం చేశారని, ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. దీనిపై హీరో రాజ్ తరుణ్ ముందస్తుగా బెయిల్ తీసుకున్నట్లు తెలుస్తోంది.