తెలంగాణ రాష్ట్రంలోని 10,954 గ్రామపాలన అధికారుల పోస్టులకు మే 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పరీక్ష ఉ.10.30 గంటల నుంచి మ.1.30 వరకు కొనసాగనుంది. హాల్‌టికెట్లు త్వరలో http://ccla.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. పరీక్షా కేంద్ర వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.