TS: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శనివారం మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం అవుతుందని సీఎం చెప్పారు. ఈ క్రమంలో సివిల్ సప్లయ్ డిపార్ట్‌మెంట్ దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనుంది. జనవరి 15 నుంచి అఫ్లికేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని సమాచారం.