ఓ పక్క వర్షాలు పడుతుంటే మరో పక్క ఎండ దంచేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఓ వైపు వడగళ్ల వానలు పడుతుండగా, మరో వైపు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎండల తీవ్రతకు రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ అగ్నికి ఆహుతి అయింది. అకస్మాత్తుగా బైక్‌లో మంటలు చెలరేగి, చూస్తుండగానే దగ్ధం అయింది. అదృష్టవశాత్తూ బైకర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.