తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకి లక్షలాది కోళ్లు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమ్మోలంకలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో 3 రోజుల్లో వేలాది కోళ్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఏలూరు జిల్లా ఉంగులూరు మండలంలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తెలిసింది. దాంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.