బర్డ్ ఫ్లూపై ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైరస్ సోకిన కిలోమీటర్ వరకే ఆంక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. 9 కిలోమీటర్ల తర్వాత చికెన్ అమ్మొచ్చని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఐదు ఫార్మ్‌లలో మాత్రమే బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయిందని.. మరే ప్రాంతంలోనూ వైరస్ ప్రభావం లేదని తెలిపారు. ఏపీ కోళ్ల వాహనాలపై తెలంగాణ ఆంక్షలు విధించలేదని మంత్రి స్పష్టం చేశారు.