ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారులు ఆదేశాలు

60చూసినవారు
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారులు ఆదేశాలు
AP: రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతోంది. ఇది, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకూ విస్తరించింది. తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం (M)లో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయింది. 2 రోజుల్లోనే 10వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో అధికారులు ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు సూచించారు. అలాగే 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో చికెన్ ఉడికిస్తే ప్రమాదం లేదని నిపుణులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్