TG: కామారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఈ వ్యాధితో వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో చాలా కోళ్ల ఫామ్ లు ఖాళీ అయిపోయాయి. విషయం తెలుసుకున్న జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. అలాగే, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సైతం తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో చికెన్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది.