ఓ యువకుడు పుట్టినరోజు వేడుకలో టపాసులతో మెరుపులు వేయాలన్న ఉత్సాహంలో ఊహించని ప్రమాదానికి గురయ్యాడు. కేక్ కటింగ్‌కు ముందు టపాసులు వెలిగించగా, అదే సమయంలో పక్కన ఉన్నవారు ఫోమ్ స్ప్రే చేయడంతో ఆ యువకుడి తలకు మంటలు అంటుకున్నాయి. కుటుంబ సభ్యులు చాకచక్యంగా స్పందించి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు “ఘోస్ట్ రైడర్‌లా మారిపోయాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.