వాహనదారులకు BIS హెల్మెట్లు తప్పనిసరి: కేంద్రం

82చూసినవారు
వాహనదారులకు BIS హెల్మెట్లు తప్పనిసరి: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ISI మార్కుతో గుర్తింపు పొందిన (BIS సర్టిఫైడ్) హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. బైక్ రైడర్ల భద్రతను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, 2026 జనవరి నుండి కొత్త బైక్స్ కొనుగోలుపై రెండు BIS హెల్మెట్లు ఉచితంగా అందించనున్నట్లు ఇటీవల కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్