తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ గెలవలేదు: మహేశ్‌కుమార్‌గౌడ్‌

77చూసినవారు
తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ గెలవలేదు: మహేశ్‌కుమార్‌గౌడ్‌
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను చూసి బీజేపీ నాయకులు అమితానందపడుతున్నారని.. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ గెలవలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆప్‌ను కోలుకోలేని దెబ్బతీశాయని, ఈ పరిస్థితికి ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే కారణమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్