TG: సీబీఐ, ఈడీలను బీజేపీ జేబు సంస్థల్లా వాడుకుంటోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈడీ చార్జీషీట్ లో చేర్చింది. ఈ విషయమై ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకే ఈడీనీ ఉపయోగించుకుంటోందని ఫైర్ అయ్యారు.