బీజేపీ నేత దారుణ హత్య (VIDEO)

0చూసినవారు
బీహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి పాట్నాలో దారుణ హత్యకు గురయ్యారు. ఖేమ్కా ఇంటి బయట దుండగులు ఆయనను గన్‌తో కాల్చి హత్యచేశారు. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పనాచే హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక బుల్లెట్, కేసింగ్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హంతకులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్