యూపీలో బీజేపీ నేత బబ్బన్ సింగ్ ఓ ఈవెంట్ సందర్భంగా ఆర్కెస్ట్రా యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరలవుతోంది. ఆమెను తాకుతూ ముద్దుపెట్టే దృశ్యాలు కలిగి ఉన్న ఈ వీడియోపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. భారతీయ సంస్కృతి, నైతికతపై బోధించే బీజేపీ నేతల అసలైన స్వరూపం ఇదేనని ఎస్పీ, కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అయితే ఈ వీడియో ఫేక్ అని, తనను అప్రతిష్ఠపాలు చేయాలని కుట్ర జరుగుతోందని బబ్బన్ సింగ్ ఖండించారు.