బీజేపీ నేతలకు మెదడు మోకాళ్లలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనం అవుతుందంటూ బీజేపీ విషపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పినట్లు జూన్ 2 లేదా డిసెంబర్‌లో విలీనమయ్యే అవకాశం లేకపోతే, బీజేపీని రాష్ట్రంలో రద్దు చేస్తారా? అని సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏకంగా డీఎన్‌ఏ పోలికలున్నాయని దయాకర్ ఆరోపించారు.