ఉత్తరప్రదేశ్లో వెలువడుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ ముందంజలో ఉంది. గజియాబాద్, పుల్పుర్, మజ్వాన్ స్థానాలలో బీజేపీ, సిస్మౌ స్థానంలో ఎస్పీ ముందంజలో ఉన్నది. అన్ని చోట్లా బీజేపీనే ఆధిక్యంలో వస్తుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికలను యోగీ, అఖిలేష్ యాదవ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.