బీజేపీ విధానాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఒడిశాలో మాట్లాడిన ఆయన.. “బీజేపీ తీసుకుంటున్న చర్యలు రాజ్యాంగ విలువలను దెబ్బతీసేలా ఉన్నాయి. అయినా ఒడిశాలో శ్రీకాంత్ జెనా వంటి వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగాన్ని సమర్థంగా రక్షించేందుకు ధైర్యంగా స్పందిస్తున్నందుకు ఆనందంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.