ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ముందు ఈసీ లొంగిపోయిందని.. ఇది చూస్తుంటే అది తన స్వతంత్ర ఉనికిని పూర్తిగా కోల్పోయినట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పదవో లేదా రాష్ట్రపతి పదవో బీజేపీ ఆఫర్ చేసినట్లుందని తీవ్ర ఆరోపణలు చేశారు.