భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన నేపథ్యంలో బీజేపీ తిరంగ యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మే 13 నుంచి 23వ తేదీ వరకు 11 రోజుల పాటు అన్ని రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగనుంది. అయితే మంగళవారం ఢిల్లీలో ఈ యాత్ర మొదలైంది. ఈ యాత్రలో వేలాదిమంది ప్రజలు పాల్గొని ఇండియా గేట్ వద్ద త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ యాత్రలో జె.పి. నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.