గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ రూ.1,737.68 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి వ్యయ నివేదికను సమర్పించింది. కాగా.. ఇది లోక్ సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఖర్చు చేసిన మొత్తం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇందులో ప్రచారానికి రూ.884.45 కోట్లు ఖర్చు చేయగా, అభ్యర్థుల సంబంధిత ఖర్చులకు రూ.853.23 కోట్లు కేటాయించినట్లు బీజేపీ తన నివేదికలో పేర్కొంది.